రిలయన్స్ మా నెట్వర్క్ను హైజాక్ చేస్తోంది : టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్
టె లిగ్రామ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని రిలయన్స్ అడ్డుకుంటోందని టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా వెలుపల వివిధ దేశాలలో తమ సేవలకు అంతరాయం కలిగిస్తోందని చేసిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బోర్డర్ గేట్ వే ప్రోటోకాల్ అనే టెక్నిక్ తో వివిధ దేశాలలో తమ నెట్ వర్క్ రూట్స్ ను హైజాక్ చేస్తోందంటూ దురోవ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది కేవలం ఇండియాలోనే కాదని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు చాలా ప్రాంతాలలో జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజీపీ అనేది ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌లలో డేటాను డైవర్ట్ కు సహాయపడే ఒక ప్రధాన ఇంటర్నెట్ రౌటింగ్ వ్యవస్థ. సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఈ అనధికారిక రూట్ అనౌన్స్మెంట్స్ ఒక తీవ్రమైన సమస్యగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను దాని డైవర్ట్ చేస్తాయి. టెలిగ్రామ్ ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని, ఈ విషయంపై వచ్చిన రిపోర్ట్స్ పై రిలయన్స్ స్పందించడంలో విఫలమైందని దురోవ్ ఆరోపించారు. మెసేజింగ్ స్పేస్ లో ఉన్న బిజినెస్ కాంపిటేషన్ గా ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ కు మేలు చేసేందుకు ర...