Posts

Showing posts with the label Registrar announces two-week vacation

ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో 300 మంది విద్యార్థులు అస్వస్థత : రెండు వారాలపాటు సెలవులు ప్రకటించిన రిజిస్ట్రార్

Image
ఆం ధ్రప్రదేశ్ లోని గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రెండు వారాలపాటు యూనివర్శిటీ రిజిస్ట్రార్ సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీలో మొత్తం శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ నిర్ణయంతో ఇప్పటికే విద్యార్థులు హాస్టల్‌లు ఖాళీ చేసి తమ సొంత ఊర్లకు పయనమయ్యారు.