Posts

Showing posts with the label Rajhmundry

ఓఎన్జీసీకి రిగ్గులు సరఫరాలో మేఘా రికార్డు

Image
ఓఎన్జీసీకి అత్యాధునిక డ్రిల్లింగ్ రిగ్గులను సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్ల మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది. ఓఎన్‌జీసీ రాజమండ్రి చమురు క్షేత్రానికి 2,000 హెచ్ పీ సామర్థ్యం గల అత్యాధునిక ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్ ను అదించడం ద్వారా అయిల్ రిగ్గుల సరఫరాలో ముందడుగు వేసినట్లు సంస్థ తెలిపింది. రాజమండ్రి చమురు క్షేత్రం ఉభయ గోదావరి జిల్లాల్లోని చమురు, గ్యాస్ నిల్వలను కవర్ చేస్తుందని.., దేశీయంగా తయారుచేసిన ఈ అత్యాధునిక ఆయిల్ రిగ్ ప్రపంచంలోనే బెస్ట్ ఫీచర్స్ ని కలిగి ఉందని వెల్లడించింది. ఈ 2,000 హెచ్ పీ సామర్థ్యం కలిగిన రిగ్, 3,000 హెచ్ పీ సామర్థ్యంతో పనిచేసే సాంప్రదాయ రిగ్గు కన్నా అధిక పనితీరును కనబరుస్తుంది. దేశీయంగానే తయారైన ఈ అత్యాధునిక రిగ్గు 6,000 మీటర్ల (6 కి.మీ)లోతు వరకు డ్రిల్లింగ్ చేయగలదు. ఇది ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నట్లు మేఘా తెలిపింది. ఇప్పటి వరకు 10 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులను ఎంఈఐఎల్ సరఫరా చేసింది. ఇందులో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మిగిలిని ఏడు ఇన్‌స్టలేషన్, కమిషనింగ్ చివర దశలో ఉన్నాయి. ఈ రిగ్గులు మరో నాలుగైదు వారాల్లో ఓఎన్జీసీ చమురు క్షేత్రాల్లో పనిచేయడం ప్రారంభిస్...