Posts

Showing posts with the label Raids on Resort in Taramati

తారామతిలో రిసార్టుపై దాడులు : డ్రగ్స్‌ టెస్టులో ఆరుగురికి పాజిటివ్‌

Image
హై దరాబాద్, గోల్కొండ తారామతిలోని ఓ రిసార్టులో గత రాత్రి డ్రగ్స్‌ పార్టీ నిర్వహించగా పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈగల్‌ టీమ్‌ ఓ ప్రకటన చేసింది. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపింది. తారామతిలో పోలీసులు, నార్కోటిక్స్‌ టీమ్స్‌తో సంయుక్త దాడులు నిర్వహించామని తెలిపింది. ఇంటర్నేషనల్‌ డీజే మోర్‌ దెన్‌ ఫ్రెండ్స్‌ పేరుతో పార్టీ నిర్వహించినట్లు వివరించింది. మెుత్తం 35 మందికి డ్రగ్స్‌ టెస్టులు నిర్వహించగా, అందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. అరెస్టయిన వారిలో వ్యాపారులు, డీజే ప్లేయర్‌, మోడల్‌, బాలీవుడ్‌ నటుడు, సర్వర్‌ ఉన్నట్లు చెప్పింది.