Posts

Showing posts with the label Rahul Gandhi arrives in Hyderabad

హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ : ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Image
హై దరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వికారాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వికారాబాద్ చేరుకున్న వారిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మంత్రులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఆ తర్వాత అనంతగిరి హిల్స్‌లోని హరిత హోటల్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి హాజరై, పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.