Posts

Showing posts with the label Protests against new UGC regulations

యూజీసీ కొత్త నిబంధనలపై నిరసనలు

Image
ఢి ల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాయలం ఎదుట యూజీసీ కొత్త నిబంధనలపై నిరసనకు దిగారు. పలు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. తక్షణమే కొత్త నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు యూజీసీ కొత్త నిబంధన రగడ సృష్టిస్తోంది. విద్యా సంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే పేరుతో జనరల్ కేటగిరీ పట్ల యూజీసీ వివక్షను ప్రోత్సహిస్తుందని.. అంతేకాకుండా కొన్ని సమూహాలు విద్యకు దూరం కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో పిటిషనర్ పేర్కొన్నాడు. 2026లో హైదరాబాద్ యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా వేముల రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆనాడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే తాజాగా క్యాంపస్‌ల్లో కుల వివక్షను తొలగించేందుకు 2012 నిబంధనలను నవీకరించింది. కొత్త నియమాలు జోడించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు మాత్రమే కాకుండా వెనుకబడిన తరగతి విద్యార్థులు కూడా కుల వివక్ష గురించి ఫిర్యాదు చేయొచ్చని యూజీసీ పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధనే దేశ వ్యా్ప్తంగా ఆందోళనలు రేకెత్తి...