బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత : భారతీయ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయం, స్థానిక పత్రికలను టార్గెట్ చేసిన నిరసనకారులు
బం గ్లాదేశ్ తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హైదీ మరణం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా రేగిన నిరసనల్లో హైదీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హైదీ మరణ వార్తతో బంగ్లాదేశ్‌లో నిరసనలు మిన్నంటాయి. భారతీయ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయంతో పాటు స్థానిక పత్రికలను కూడా నిరసనకారులు టార్గెట్ చేశారు. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఛత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఆవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఆవామీ లీగ్ కార్యాలయాలతో పాటు పత్రికా ఆఫీసులనూ ఆందోళనకారులు టార్గెట్ చేశారు. ప్రథమ్ ఆలో, డెయిలీ స్టార్ పత్రికా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. హైదీ పేరిట పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డెయిలీ స్టార్ కార్యాలయంలో మంటలు రేగడంతో పులువురు జర్నలిస్టులు చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు. డెయిలీ స్టార్ కార్యాలయంలో...