Posts

Showing posts with the label Prime Minister Narendra Modi's call on the X platform

దేశ ప్రజలు దృఢచిత్తం, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి !

Image
ప్ర ధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా నూతన సంవత్సరంలో దేశ ప్రజలు దృఢచిత్తం, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో తమ లక్ష్యాలను చేరుకోవాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. ప్రజలు నూతన ఏడాదిలో చేసుకున్న తీర్మానాలకు అనుగుణంగా ఆత్మశక్తితో ముందుకు సాగాలని తెలిపారు. ఈ సందర్భంగా సంస్కృత శ్లోకాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు. విజయం తథ్యమని, పట్టుదలతో ఎలాంటి సంకోచాలు లేకుండా, అప్రమత్తతతో సౌభాగ్య జీవన మార్గంలో ముందడుగు వేయాలనే శ్లోకాన్ని ఆయన షేర్ చేశారు. స్థిర చిత్తం, లక్ష్యంపై స్పష్టతే విజయానికి పునాదులు అని అన్నారు. జీవిత లక్ష్యం ఏంటో తెలియజెప్పే మరో సంస్కృత స్లోకాన్ని కూడా ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. జ్ఞానం, సంపద, ధైర్యం, శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు, మేధో సామర్థ్యాలు, సహనం, సహృదయత పెంపొందించుకోవడమే జీవిత లక్ష్యమని ఉపదేశించే పద్యాన్ని నెటిజన్లతో ప్రధాని షేర్ చేశారు. అటు భారతీయ అధ్యాత్మిక సంప్రదాయాన్ని, నేటి ఆధునిక ప్రపంచ లక్ష్యాలను మేళవిస్తూ స్ఫూర్తివంతంగా జీవితంలో ఎలా ముందడుగు వేయాలో వివరిస్తూ ప్రధాని ఈ శ్లోకాలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.