Posts

Showing posts with the label Prime Minister Narendra Modi is visiting the state

మే 10న జనాగ్రహ సభ : బీజేపీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్

Image
తె లంగాణలోని కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో , బీజేపీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలికేలా ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రాష్ట్రానికి వస్తున్నారని, ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈనెల భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, ఇండియా కూటమి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేలా ఈనెల 10న, "జనాగ్రహ సభ"ను నిర్వహించడానికి బిజెపి తెలంగాణ పార్టీ సన్నాహాలు చేస్తుందని, ప్రధాని మోడీ హాజరయ్యే ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరవుతారని, ఇది తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే సభగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఏ లా నడపాలో అర్థం కాని స్థితిలో పాలన కొనసాగిస్తుందన్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారని , ఆ పార్టీ అవుట్ డేటెడ్ ...