Posts

Showing posts with the label Price Cuts for Range Rover SV and Range Rover Sport SV

భారత్-యూకే మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ : రేంజ్ రోవర్ SV, రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరల తగ్గింపు

Image
భా రత్-యూకే మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన రేంజ్ రోవర్ SV, రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరలను గణనీయంగా తగ్గించింది. ఈ చర్యతో దిగుమతి సుంకాల్లో లభించిన ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ధరల ప్రకారం రేంజ్ రోవర్ SV ధరను రూ.4.25 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు తగ్గించారు. అంటే ఈ మోడల్‌పై నేరుగా రూ.75 లక్షల వరకు కోత విధించారు. అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరను రూ.2.75 కోట్ల నుంచి రూ.2.35 కోట్లకు తగ్గిస్తూ రూ.40 లక్షల తగ్గింపు ఇచ్చారు. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దీంతో లగ్జరీ SUV కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవకాశంగా మారింది. ధర తగ్గింపుతో పాటు రేంజ్ రోవర్ SV మోడల్‌లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఇప్పుడు ఇందులో ఎస్ వీ అల్ట్రా మెటాలిక్ పెయింట్ ఆప్షన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. ఇది గ్లోస్ , సాటిన్ ఫినిష్‌లలో లభ్యమవుతూ వాహనానికి మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా మాట్లాడుతూ, ఈ నిర్ణయం పూర్తిగా కస్టమర్ ఫస్ట...