Posts

Showing posts with the label Prakash Raj Claims His Words Were Distorted

రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు : వక్రీకరించారన్న ప్రకాశ్ రాజ్

Image
సా హితీ కార్యక్రమంలో తన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. తాను అవతారపురుషుడు శ్రీరాముడిని వెటకారం చేశానని, హిందూ ధర్మాన్ని గాయపరిచేలా మాట్లాడానని అంటున్నారు. అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే తనకు ఆ అవసరం లేదు. కానీ ధర్మాన్ని, మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వారిని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అలాంటి వారు నన్ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాళ్ల ఏడ్పు నాకు అర్థం అవుతోందని అలాంటి వారికి సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ప్రస్తుతం తోట పనుల్లో ఉన్నాని ఆ పనులు అయ్యాక వస్తానని ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. కాగా సదరు ఆ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చినవారని, దక్షిణాదిలో ఓ గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి పండ్లు తిన్నారని, ఆ విషయంపై వివాదం చెలరేగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ప్రకాశ్‍రాజ్‍కు పరువు న...