Posts

Showing posts with the label Pezeshkian visited the Atomic Energy Organization of Iran in Tehran on Sunday

అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం : ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్

Image
ఇ రాన్ లోని టెహ్రాన్‌లో అణుశక్తి సంస్థను ఆదివారం అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు, శక్తి, వైద్యం, మానవ అవసరాల కోసమేనని పెజెష్కియన్ పునరుద్ఘాటించారు. జూన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ అణు కేంద్రాలపై దాడి చేశాయి. దాడి అనంతరం అమెరికా మాట్లాడుతూ ఈ కేంద్రాలను అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారని పేర్కొంది. అయితే ఇరాన్ తన కార్యక్రమం పూర్తిగా శాంతియుతమని కొనసాగిస్తోందని చెప్పింది. అమెరికా – ఇజ్రాయెల్ దాడుల్లో అనేక మంది ఇరానియన్ శాస్త్రవేత్తలు, అధికారులు మరణించారు. ఈ దాడిలో యురేనియం సుసంపన్న కర్మాగారాలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై 500 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్...