Posts

Showing posts with the label Peter Navarro

అమెరికా విద్యుత్‌ను ఉపయోగించి భారత్‌ వంటి దేశాల్లో యూజర్లకు ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సేవలు అందిస్తున్నాయి !

Image
అ మెరికా ఏఐ కంపెనీలు భారత్ వంటి దేశాల్లో సేవలు అందించడాన్ని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తప్పుపట్టారు. చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌లు అమెరికా భూభాగంపై వనరులను ఉపయోగిస్తున్నాయని పీటర్ నవారో అన్నారు. ఆయా సంస్థలు అమెరికాలోని విద్యుత్‌ను ఉపయోగించి పనిచేస్తున్నాయని, కానీ, భారత్‌ వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో యూజర్లకు సేవలు అందిస్తున్నాయని అన్నారు. భారత్‌లో ఏఐ సేవల కోసం అమెరికన్లు ఎందుకు డబ్బులు చెల్లిస్తున్నారు? అని నవారో ప్రశ్నించారు. అంతేకాకుండా ఇతర దేశాలకు చెందిన సంస్థలు అమెరికాలో వ్యవసాయ భూములను వాస్తవ ధర కంటే పది రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయన్నారు. ఇది అమెరికాలో ధరల పెరుగుదలకు కారణమవుతుందని అన్నారు. కాగా, ఇటీవల భారత్‌పై పీటర్ నవారో చేసినవి తప్పుడు వ్యాఖ్యలని ఎక్స్ ఫ్యాక్ట్‌ చెక్ స్పష్టం చేసింది. రష్యా నుంచి కేవలం ఇంధన భద్రత కోసమే.. భారత్‌ చమురు కొనుగోలు చేస్తోందని క్లారిటీ ఇచ్చింది. "భారత అధిక టారిఫ్‌లో విధించడంతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. లాభం కోసం రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌తో రష్యా కొనసాగిస్తోన్న యుద్ధానికి ...