Posts

Showing posts with the label People of the state are debating whether TVK will remain in power for even three months

టీవీకే మూడు నెలలైనా అధికారంలో కొనసాగుతుందా అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు : మాజీ సీఎం ఎంకే స్టాలిన్

Image
త మిళనాడులో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా అధికారంలో కొనసాగుతుందా అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో కనీసం ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయకూడదని తాము భావించామని, కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దారుణంగా మారడంతో ఆ గడువు కంటే ముందే స్పందించాల్సి వస్తోందని అన్నారు. ప్రజాదరణ లేని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని తాను భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే డీఎంకే క్షేత్రస్థాయిలో 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా వ్యూహంతో కసరత్తులు ప్రారంభించిందని స్టాలిన్ గుర్తుచేశారు. బూత్ స్థాయి ఏజెంట్లను నియమించడం, ప్రాంతీయంగా కీలక సమావేశాలు నిర్వహించడం వంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాము అధికారంలోకి రాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, కొందరు కనీసం ఓటర్లను కలవకపోయినా, బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించుకోకపోయినా అదృష్టవశాత్తూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని టీవీకే అధినేత విజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించ...