Posts

Showing posts with the label Pendurthi to tremble like twigs

ఉత్తర కోస్తాంధ్రలో బీభత్సం సృష్టించిన గాలివాన

Image
ఆం ధ్రప్రదేశ్ లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో గాలివాన సృష్టించిన బీభత్సం సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అమరావతి వాతావరణ కేంద్రం అందించిన తాజా నివేదిక ప్రకారం, దక్షిణ కర్ణాటక పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం మరియు అక్కడి నుంచి మహారాష్ట్రలోని మరాఠ్వాడా వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో బుధవారం మధ్యాహ్నం ప్రకృతి ప్రకోపం స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పెందుర్తి పరిసర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఈ గాలివాన ధాటికి బీఆర్టీఎస్‌ ప్రధాన రహదారి వెంబడి ఉన్న భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు గాలిలో ఎగిరిపోయాయి. మరీ ముఖ్యంగా, సరిపల్లి సమీపంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కుమారుడి వివాహం కోసం అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన భారీ పెళ్లి సెట్టింగ్ ఈ ఈదురు గాలులకు కుప్పకూలిపోయింది. వివాహ వేడుక కోసం చేసిన ఏర్పాట్లు ధ్వంసం కావడంతో అక్కడ భారీ నష్టం వాటిల్ల...