Posts

Showing posts with the label Pawan Kalyan moves Delhi High Court

వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్‌ కల్యాణ్‌

Image
ఆం ధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్‌మీడియా, ఈ-కామర్స్‌ వేదికలుగా తమ క్లయింట్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా పలు పోస్టులు వైరల్‌ అవుతున్నాయని, వాటిని తక్షణమే తొలగించాలని పవన్ కల్యాణ్ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. పవన్ కల్యాణ్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పోస్టులకు సంబంధించిన లింక్‌లను ఏడు రోజుల్లోపు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. పవన్ కల్యాణ్ తరఫు న్యాయవాది తాను తొలగించాలని కోరుకుంటున్న యూఆర్‌ఎల్‌ల జాబితాను 48 గంటల్లోపు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు డిసెంబరు 22కు వాయిదా వేసింది.