పోస్టాఫీసుల నిబంధనలలో మార్పులు చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ !
పో స్టాఫీసుల నిబంధనలలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 ప్రకారం పోస్టాఫీసుల్లో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడానికి తప్పనిసరిగా కస్టమర్లు పాన్ వివరాలు అందించాలని కేంద్రం తెలిపింది. సేవింగ్స్ అకౌంట్స్, డిపాజిట్ స్కీముల్లో పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పాన్ కార్డు మర్చిపోతే ఫారం 97 సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్లు, నగదు విత్ డ్రా, టైమ్ డిపాజిట్లు, పెట్టుబడి స్కీమ్స్ ఇలా అన్నీంటికీ పాన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కమ్ రూల్స్ 237,211,161,160,159 ప్రకారం పాన్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పోస్టాఫీస్ ఆర్డర్ నెం.02/2026 ఆధారంగా ఈ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. పాన్ లేకపోతే ఫారం 97 అందించాలి. ఇందులో పేరు, అడ్రస్, ట్రాన్సాక్షన్ వివరాలు అన్నీ అందించాలి. అంతేకాకుండా వాటికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అందించాల్సి ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్స్‌ను భద్రపరిచే బాధ్యత పోస్టాఫీసులపై ఉంటుంది. అలాగే పోస్టాఫీసు స్కీముల...