ఏఐ సబ్ స్క్రిప్షన్ రూపాయల్లో కొనుగోలు చేసే అవకాశం !
ఏఐ సర్వీస్ ను పొందాలంటే సబ్ స్క్రిప్షన్ కోసం కేవలం డాలర్స్ లో మాత్రమే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ క్లాడ్ AI ఇండియా సబ్ స్క్రిప్షన్ ను భారతీయ రూపాయల్లో కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు భారతీయ యూజర్లు కేవలం అమెరికన్ డాలర్లలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలు, బ్యాంక్ ఫీజులు వంటి అదనపు ఖర్చు యూజర్లు భరించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ఇండియాలో లోకల్ ప్రైసింగ్ అమల్లోకి తెచ్చింది. ఈ అవకాశం తో యూజర్లు రూపాయల్లోనే సబ్ స్క్రిప్షన్ తీసుకునే అవకాశం లభిస్తోంది. అంతేకాదు, ఈ ప్రైసింగ్ లో జీఎస్టీ కూడా చేర్చబడినట్లు కంపెనీ తెలిపింది. భారతీయ యూజర్లకు స్మూత్ ట్రాన్సాక్షన్ కోసం మరియు యూజర్ బేస్ ను మరింత పెంచడానికి ఈ కొత్త చర్య తీసుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో క్లాడ్ ప్రో ప్లాన్ ధర నెలకు సుమారు రూ. 1,999 నుంచి ప్రారంభమవుతుంది. అదనంగా క్లాడ్ మ్యాక్స్ మరియు క్లాడ్ టీమ్ ప్లాన్ లకు కూడా భారతీయ ధరలను Anthropic ప్రకటించింది. వ్యక్తిగత వినియోగదారులు, స్టార్టప్స్, డెవలపర్లు, వ్యాపార సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా సరైన ప్లాన్ ...