Posts

Showing posts with the label One person dies after eating biryani in Hyderabad

హైదరాబాద్ లో బిర్యానీ తిని ఒకరు మృతి : 15 మందికి అస్వస్థత

Image
హై దరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులను చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. మద్యం లేదా ఆహారంలో ఏదైనా కలుషితం కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.