Posts

Showing posts with the label Oil Palm: A Profitable Crop in Every Respect

అన్ని విధాలా లాభదాయకమైన పంట ఆయిల్‌ పామ్ !

Image
తె లంగాణలోని సిద్ధిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్‌ పామ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పనితీరును పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన, ఆయిల్‌ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. గతంలో ఆయిల్‌ పామ్ ధర టన్నుకు కేవలం రూ. 12 వేలు మాత్రమే ఉండేదని మంత్రి గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ప్రస్తుతం టన్ను ధరను రూ. 20 వేలకు పైగా పెంచగలిగామని ఆయన వెల్లడించారు. ఇది ఆయిల్‌ పామ్ సాగు చేసే రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు నిస్సంకోచంగా ఆయిల్‌ పామ్ పంటను సాగు చేయాలని మంత్రి సూచించారు. ఈ పంటకు నీటి ఎద్దడి సమస్య ఉండదని, అలాగే మార్కెటింగ్ విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని భరోసా ఇచ్చారు. "అన్ని విధాలా లాభదాయకమైన పంట ఇది. పెట్టుబడి, ఎరువులు వంటి అన్ని అవసరాలను ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది" అని ఆయన పేర్కొన్నారు. నర్మెట్ట ప్రాంత రైతుల కోసం త్వరలోనే ఒక భారీ 'రైతు మేళా' నిర్వహిస్తామని తుమ్మల నాగేశ్వరరావు...