Posts

Showing posts with the label Nothing Cancels CMF Phone 3 Pro Launch

సీఎంఎఫ్ ఫోన్ 3ప్రో లాంచ్‌ను రద్దు చేసిన నథింగ్ సంస్థ : విడిభాగాల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Image
న థింగ్ సంస్థ సీఎంఎఫ్ ఫోన్ 3ప్రో లాంచ్‌ను రద్దు చేసినట్లు కంపెనీ కో-ఫౌండర్ అకిస్ ఎవాంజెలిడిస్ స్వయంగా 'X' వేదికగా వెల్లడించారు. విడిభాగాల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్లోబల్ మార్కెట్‌లో విడిభాగాల ధరలు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ర్యామ్, స్టోరేజ్ చిప్స్ ధరలు భారంగా మారాయి. తక్కువ ధరకే ప్రీమియం లుక్ అందించడమే సీఎంఎఫ్ లక్ష్యం. కానీ, విడిభాగాల రేట్లు పెరగడంతో ఆ తక్కువ ధరకే ఫోన్‌ను అందించడం సాధ్యం కాదని కంపెనీ భావించింది. అందుకే కొత్త ఫోన్ కంటే, ప్రస్తుతం ఉన్న మోడల్స్‌ను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. మన దేశంలో విభిన్నమైన డిజైన్ల కోసం చాలామంది సీఎంఎఫ్ బ్రాండ్‌ను ఇష్టపడతారు. ముఖ్యంగా రూ. 20,000 లోపు సెగ్మెంట్‌లో దీనికి మంచి క్రేజ్ ఉంది. 2026లో వచ్చే ప్రో వెర్షన్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లను చూసుకోవడం మంచిది. ఈ నిర్ణయం వల్ల ఇతర బ్రాండ్లకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఓవర్‌ప్రైజ్డ్ ఫోన్లను రిలీజ్ చేసి బ్రాండ్ ఇమేజ్ తగ్గించుకోవడం కంటే, వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గడమే మేలని నథ...