Posts

Showing posts with the label Nepal is not one of India's largest markets

భారత్ మామిడి దిగుమతులపై నిషేధం విధించిన నేపాల్

Image
భా రత మమాడి పండ్లలో అధిక స్థాయిలో రసాయన పురుగు మందులు ఉన్నాయనే ఆరోపణలపై నేపాల్ నిషేధించింది. అధిక స్థాయిలో పురుగుమందులు ఉన్న భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధిస్తున్నట్లు బాలెన్ షా ప్రభుత్వం ప్రకటించింది. నేపాల్ భారతదేశానికి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి కానప్పటికీ ఈ ఆంక్షలు అల్ఫోన్సో, దశేరి, చౌసా, కేసర్, లంగ్రా , బంగనపల్లి వంటి అత్యుత్తమ భారతీయ రకాల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రసాయన పురుగు మందుల ఆనవాళ్లు ఉండటం భారతదేశపు పండ్ల ఉత్పత్తి విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది. నేపాల్ కూడా పరిమితంగా మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు. మే మధ్య నుంచి జూలై మధ్య వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. మధేష్ ప్రావిన్స్‌లోని సిరహా, సప్తరి , ధనుషా జిల్లాలు దేశంలో ప్రధాన మామిడి ఉత్పత్తి కేంద్రాలు. భారతీయ మామిడి పండ్లపై విధించిన ఈ ఆంక్షలు దేశీయ పండ్ల రకాలకు ప్రయోజనం చేకూరుస్తాయని నేపాల్ అధికారులు అంటున్నారు. భారతదేశం ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అందులో సుమారు 32 వేల మెట్రిక్ ట...