Posts

Showing posts with the label National Highway NH-65

విజయవాడ హైవేపై ఐదురోజుల్లో 3.04 లక్షల వాహనాలు రాకపోకలు !

Image
సం క్రాంతికి హైదరాబాద్ నగరం దరిదాపు ఖాళీ అయ్యింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి NH-65 ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడింది.  గత ఐదు రోజులుగా ఈ మార్గంలో అసాధారణ రద్దీ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద చేసిన గణాంకాల ప్రకారం, ఐదు రోజుల వ్యవధిలోనే రెండువైపులా కలిపి మొత్తం 3.04 లక్షల వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగించాయి. ఈ వాహనాల్లో దాదాపు 2.04 లక్షలు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లిన వాహనాలే కావటం గమనార్హం. అత్యధికంగా, శనివారం ఒక్కరోజే 71,284 వాహనాలు పంతంగి టోల్‌ప్లాజాను దాటాయని లెక్కలు చెప్తున్నాయి. ఇక శుక్రవారం 53 వేల వాహనాలు, ఆదివారం 62 వేల వాహనాలు, సోమవారం 56 వేల వాహనాలు, మంగళవారం 62 వేల వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి. ఇక బుధవారం నాడు భోగి కావటంతో రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి ప్రయాణికుల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. గతేడాది మూడు రోజుల ముందు 2.07 లక్షల వాహనాలు ప్రయాణించగా, ఈసారి ఆ సంఖ్య 3 లక్షలు దాటడం విశేషంగా చెప్పొచ్చు. అయితే రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు ...