Posts

Showing posts with the label NHAI Introduces Facility to Obtain Digital Local Pass via Mobile

'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ : మొబైల్ నుంచే డిజిటల్ లోకల్ పాస్ పొందే సదుపాయాన్ని కల్పించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ

Image
టో ల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండే స్థానిక వాహనదారులు ఇకపై టోల్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ మొబైల్ నుంచే డిజిటల్ లోకల్ పాస్ పొందే సదుపాయాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ ద్వారా ఈ పాస్‌ను సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ డిజిటల్ లోకల్ పాస్ పొందిన స్థానిక వాహనదారులు సంబంధిత టోల్‌ప్లాజా గుండా నెల మొత్తం ఎన్ని సార్లైనా అపరిమితంగా ఉచితంగా లేదా రాయితీతో ప్రయాణించవచ్చు. గతంలో ఈ పాస్ కోసం టోల్ ఆఫీసులకు వెళ్లి వరుసలో నిలబడి పత్రాలు సమర్పించాల్సి రాగా, ఈ నూతన డిజిటల్ విధానంతో స్థానికులకు సమయం, శ్రమ ఎంతగానో ఆదా కానున్నాయి. ప్రస్తుతానికి ఈ డిజిటల్ లోకల్ పాస్ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డు-2 పై ఉన్న ‘బక్కర్‌వాలా టోల్‌ప్లాజా’ వద్ద అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. ఇక్కడ వచ్చిన స్పందనను పరిశీలించిన అనంతరం, త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల వద్ద ఈ సేవలను విస్తరిస్తామని వెల్లడించింది.