Posts

Showing posts with the label Musi River Beautification and Development Project

మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో కీలక ముందడుగు : 734.07 భూమిని ఎంఆర్డీసీఎల్ కు బదలాయించేందుకు సిద్ధం

Image
తె లంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. మూసీ నది సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా 734.07 భూమిని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) కు బదలాయించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయంతో మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదలాయించే భూములు రంగారెడ్డి జిల్లాలోని నాలుగు మండలాల్లో విస్తరించి ఉన్నాయి. హిమాయత్ సాగర్ లోని ఈసా నది వద్ద, గండిపేట మండలంలోని కిస్మత్ పూర్, రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతి నగర్, బడ్వేల్, శంషాబాద్ మండలంలోని కొత్వాల్ గూడలో హెచ్ ఎండీ ఏ లే అవుట్ ల కోసం కేటాయించిన ఈ భూములను బదలాయించారు. మూసీ నది సుందరీకరణతోపాటు రివర్ ఫ్రంట్ కారిడార్ అభివృద్దిని చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ కు 734.07 ఎకరాల భూమిని బదలాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను సైతం మూసీ రివర్‌ఫ్రం...