Posts

Showing posts with the label Mother who killed five-month-old baby

ఐదు నెలల చిన్నారిని చంపిన కన్నతల్లి

Image
త మిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్‌, కెలమంగళం సమీపంలోని చిన్నట్టి అనే గ్రామంలో సురేష్‌, భారతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఇటీవలే కుమారుడు పుట్టాడు. వయసు ఐదు నెలలు. అయితే, మూడు రోజుల క్రితం చనిపోయాడు. పాలు పడుతుండగా పొలమారి ఊపిరి ఆడక చనిపోయాడని చెబుతూ భారతి కన్నీటిపర్యంతమైంది. కుటుంబ సభ్యులు కన్నీటితో బాబుకు అంత్యక్రియలు జరిపారు. ఆ తర్వాత భారతి ప్రవర్తనలో మార్పు చూసి సురేష్‌ అనుమానించాడు. భారతి మొబైల్ చెక్ చేయగా అందులో షాకింగ్ ఫొటోలు కనిపించాయి. భారతి స్వలింగ సంపర్కురాలని, సుమిత్ర అనే మహిళతో అనుచిత బంధం నెరుపుతోందని గుర్తించాడు. దీంతో కుమారుడి మరణం సహజమైందేనా లేక భార్యే చంపేసిందా అనే అనుమానంతో పోలీసులను ఆశ్రయించాడు. సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భారతి, సుమిత్రలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భర్త సురేష్ తో పాటు కుటుంబ సభ్యులందరూ పనికి వెళ్లిన సమయంలో భారతే కొడుకును ఊపిరి ఆడకుండా చేసి చంపేసిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.