Posts

Showing posts with the label Missing Woman Case

ఒంటరి మహిళ అదృశ్యం కేసు : ఛేదించిన ఆదిలాబాద్ పోలీసులు

Image
తె లంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఒంటరి మహిళ అదృశ్యం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. అది కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే కాదని, పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ హత్య అని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ కేంద్రంలోని పిట్టలవాడకు చెందిన ఇమ్రానా జబీన్ (39) నవంబర్ 26, 2025 నుంచి కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆమె సోదరి ఫిర్యాదుతో మావల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, లోతుగా విచారణ జరిపిన పోలీసులకు ఇంద్రవెల్లికి చెందిన మొహమ్మద్ ఫారూక్ అనే వ్యక్తితో మృతురాలికి ఆర్థిక వివాదాలు ఉన్నట్లు తెలిసింది. ఫారూక్ ఆమె వద్ద నుండి రూ. 8.8 లక్షల నగదు తీసుకోవడంతో పాటు 8.5 తులాల బంగారాన్ని కూడా తన వద్ద ఉంచుకున్నాడు. తన సొంత అవసరాల కోసం ఆ డబ్బును, బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఇమ్రానా గట్టిగా నిలదీయడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని ...