Posts

Showing posts with the label Ministry of Railways

దేశంలో 6,117 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై : రైల్వే మంత్రిత్వశాఖ

Image
దే శవ్యాప్తంగా 6,117 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫైని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే మంత్రిత్వశాఖ ఈ ఫెసిలిటీ కోసం అదనంగా బడ్జెట్‌ను ఆమోదించలేదు. ప్రస్తుతం ఉన్న వనరులను ఉపయోగించుకొని సేవలను ప్రారంభించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రయాణీకులకు మెరుగైన సౌలభ్యం. సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు డిజిటల్, భద్రతా మౌలిక సదుపాయాలు రెండింటినీ నిరంతరం బలోపేతం చేస్తున్నామని రైల్వేమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న వనరులను ఉపయోగించి, పార్టనర్‌షిప్‌ మోడల్‌లో రైల్వేస్టేషన్లలో వై ఫై సేవలను ప్రారంభించారు. వెయిటింగ్‌లో ప్రయాణీకులకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం, డిజిటల్‌ ఇండియా ప్రాచారాన్ని బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. ఈ సౌకర్యం పెద్ద సంఖ్యలో ప్రయాణీకులకు స్టేషన్‌లో టికెట్ బుకింగ్, ప్రయాణ సమాచారం, ఇతర ఆన్‌లైన్ సేవలను సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. రైల్వే స్టేషన్లలో వై-ఫైని యాక్సెస్ చేయడానికి, ప్రయాణీకులు తమ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. గుర్తింపు రుజువు, ఈ-మెయిల్‌ తదితర వ్యక్తిగత సమాచారం ఏమీ అవసరం లేద...