Posts

Showing posts with the label Minister Ponnam Prabhakar Clarifies

అశోక్ ఆర్టీసీ ఉద్యోగి కాదు : పౌరుడిగా అశోక్ రైతుల పక్షాన మాట్లాడిన తీరును తాము పూర్తిగా స్వాగతిస్తున్నాం

Image
తె లంగాణలోని జగిత్యాలలో రైతుల పక్షాన నిలబడి అధికారులను ప్రశ్నించిన అశోక్ అనే బస్సు డ్రైవర్‌ను ఉద్యోగం నుండి తొలగించారంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ (X) వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. అశోక్‌ను విధుల్లోంచి తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, అదంతా పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అసలు అశోక్ అనే వ్యక్తి ఆర్టీసీ శాశ్వత ఉద్యోగి కాదని, ఆయన కేవలం ఒక ప్రైవేట్ హైర్ బస్సుకు సంబంధించిన డ్రైవర్ మాత్రమేనని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ, రైతుల సమస్యలపై స్పందించి మాట్లాడినందుకు అతనిపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండకూడదనే ఉద్దేశంతో, అతన్ని విధుల్లోంచి అస్సలు తొలగించవద్దని తాము స్వయంగా సదరు ప్రైవేట్ బస్సు యాజమాన్యానికి సూచించామని వెల్లడించారు. ఒక పౌరుడిగా అశోక్ రైతుల పక్షాన మాట్లాడిన తీరును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న ప్రచారాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ,...