Posts

Showing posts with the label Minister Nadendla Manohar Holds Emergency Video Conference on Fuel Shortage

ఇంధన కొరతపై అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్

Image
ఆం ధ్రప్రదేశ్ లో ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పెట్రోల్-డీజిల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు, అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన కొరత, కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న 'నో స్టాక్' బోర్డులు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై సమగ్రంగా చర్చ జరిగింది. రేపు ఉదయం 6 గంటలకల్లా రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా పూర్తిచేయాలని ఆయిల్ కంపెనీలను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని, జిల్లాల వారీగా పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో అన్ని బంకులకు ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. బ్లాక్ మార్కెట్ వ్యవహారంపై కూడా సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. కొందరు డీజిల్, పెట్రోల్‌ను అక్రమంగా ...