Posts

Showing posts with the label Minister Atchannaidu

రంగు మారిన పత్తి కొనుగోలుకు కేంద్రం సానుకూలం !

Image
ఆం ధ్రప్రదేశ్ లోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది. గతంలో ఏపీ ప్రభుత్వం లేఖ ద్వారా కేంద్రానికి సూచించిన ఆరు కీలక అంశాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మూడు అంశాల అమలు ప్రక్రియను ప్రారంభించింది. దీనివల్ల పత్తి కొనుగోలులో ఏర్పడిన సమస్యలు పరిష్కారం వైపు సాగుతున్నాయి. పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా దశలవారీగా ప్రారంభమయ్యాయని, కొనుగోలు ప్రక్రియ మొదలైందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తి నాణ్యత సి.సి.ఐ నిర్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని, మిగిలిన మూడు అంశాలైన L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణం కారణంగా తేమ శాతం 12% నుండి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయడం, వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ అంశాల ప్రాధాన్యతను వివరించి, రైతులకు తక్షణ ప్రయోజనం కలిగేలా చూడాలని అభ్యర్థించినట్లు తెల...