Posts

Showing posts with the label Minister Anam Ramanarayana Reddy

తిరుమలలో చేసిన పాపాలపై ప్రజల్లో చర్చలు జరగకుండా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు !

Image
ఆం ధ్రప్రదేశ్‌, నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూటమి పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో ఘోర అపచారాలు, మాహాపాపలు, అక్రమాలు జరిగాయన్నారు. పాలు, వెన్న లేకుండానే నెయ్యి తయారు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. తద్వారా ప్రపంచంలోనే తొమ్మిదో వింతను ఆయన కనిపెట్టారని ఎద్దేవా చేశారు. ఆ ఫార్మూలను ఆయన ఇప్పుడు మరచిపోయారని దెప్పి పొడిచారు. 2020లో వైసీపీ హయాంలోనే తీసిన శాంపిల్స్ పంపితే అందులో నెయ్యి లేదని, జంతువుల కొవ్వు ఉందని తేలిందన్నారు. 2022లో నివేదికలు వస్తే నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నెయ్యి లేని చోట నెయ్యి సృష్టించే భోలేబాబా కోసం నిబంధనలు మార్చారని విమర్శించారు. హవాలా ద్వారా రూ.వందల కోట్లు జగన్ కంపెనీలకి చేరాయని మంత్రి ఆరోపించారు. భోలేబాబా, వైష్ణవి వంటి కంపెనీలు అందుకు ముఖ్య భూమిక పోషించాయన్నారు. వైవీ సుబ్బారెడ్డి పీఏకే రూ.4.5 కోట్లు డైరెక్ట్ గా బ్యాంకు లావాదేవీలు జరిగాయని, ఆ లెక్కన పెద్దలకి ...