Posts

Showing posts with the label Mercedes-Benz S-Class Launch on June 15

జూన్ 15న మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ విడుదల

Image
దే శీయ మార్కెట్లో జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ సెడాన్ 'మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్'  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జూన్ 15న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దేశంలోనే మొదటిసారిగా ఈ సిరీస్‌లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ సాంకేతికతను పరిచయం చేస్తున్నారు. మార్కెట్లో ధరలను పోటీగా ఉంచేందుకు వీలుగా ఈ హైబ్రిడ్ వేరియంట్‌ను మహారాష్ట్రలోని చాకన్ ప్లాంట్‌లో స్థానికంగానే అసెంబుల్ చేయాలని మెర్సిడెస్ యోచిస్తోంది. సరికొత్త సాఫ్ట్‌వేర్, అదిరిపోయే రేంజ్, ఇంటీరియర్ లగ్జరీతో వస్తున్న ఈ కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సరికొత్త 'ఎస్ 450ఇ' (S 450e) మోడల్‌లో 3.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇన్‌లైన్-సిక్స్ ఇంజన్‌ను పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేశారు. ఇవి రెండూ కలిసి సంయుక్తంగా 435 Bhp పవర్‌ను, 680 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో అమర్చిన 22kWh బ్యాటరీ ప్యాక్ సహాయంతో కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఈ కారు గరిష్టంగా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. వేగం విషయానికి వస్తే, ఈ లగ్జరీ సెడాన్ కేవలం ...