సంవత్సర కాలం పెయిడ్ లీవ్ ప్రకటించిన మీషో
మీషో ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో బాగా పాపులర్ అవుతోంది. మీషో సంస్థ తమ ఉద్యోగులకు అన్‌లిమిటెడ్ లీవ్ పాలసీని ప్రకటించింది. ఉద్యోగులు 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగులకు 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే లభిస్తుంది. మీషో మీకేర్ ప్రోగ్రామ్ ద్వారా 365 రోజుల వరకు పెయిడ్ లీవ్స్ పొందొచ్చు. తమ కుటుంబ సభ్యులు ఎవరైనా క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఇది తరచుగా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంటే, ఎక్కువకాలం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటే ఉద్యోగులు లీవ్ తీసుకోవచ్చు. వ్యక్తిగత అభిరుచులు లేదా లక్ష్యాల కోసం కొంత సమయం తీసుకోవాలని కోరుకునే ఉద్యోగులకు కూడా ఈ విధానం వర్తిస్తుంది. వాళ్లు కూడా 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగులు అనారోగ్యంతో ఉన్నా పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. సెలవు కాలంలో పూర్తి జీతం లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం తీసుకున్న సెలవుల కోసం, ఉద్యోగులకు సెలవు సమయంలో జీతంలో 25 శాతం వరకు లభిస్తుంది. పరిహారంతో పాటు, ప్రావిడెంట్ ఫండ్, బీమా, అదనపు మెడికల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఒకవేళ నాన్ మెడికల...