Posts

Showing posts with the label Maoist Politburo Member Misir Besra Arrested

మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్‌ బేస్రా అరెస్ట్‌

Image
మా వోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్‌ బేస్రా ఎట్టకేలకు భద్రతా బలగాల వలలో చిక్కాడు. ఆయనపై రూ.1 కోటి రివార్డు ఉండటం గమనార్హం. ఝార్ఖండ్‌ వేదికగా భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్వహించిన పకడ్బందీ ఆపరేషన్‌లో మిసిర్‌ బేస్రాతో పాటు మరో ఇద్దరు కీలక మావోయిస్టు నాయకులు కూడా పోలీసులకు చిక్కారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి పూట ఝార్ఖండ్‌ పోలీసులు, కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం, కోబ్రా బెటాలియన్‌ బలగాలు సంయుక్తంగా ధన్‌బాద్‌ మరియు గిరిడిహ్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. మిసిర్‌ బేస్రా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అందిన పక్కా నిఘా సమాచారంతో బలగాలు వ్యూహాత్మకంగా ఉచ్చు బిగించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ మెరుపు దాడిలో మావోయిస్టు రీజినల్‌ కమిటీ సభ్యులుగా ఉన్న మెహనత్‌ అలియాస్‌ మొచ్చు, విభీషణ్‌ ముర్ము, గౌరవ్‌ అలియాస్‌ సౌరభ్‌లను కూడా అరెస్ట్ చేశారు. వీరి తలపై చెరో రూ.15 లక్షల రివార్డు ఉండటం విశేషం. ఈ అరెస్టులకు ముందు రాంచీలో మంగళవారం ఏకంగా 16 మంది మావోయిస్టు కేడర్ సభ్యులు పోలీసు అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారిలో మోస్ట్‌ వాంటెడ్...