మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభణ : ఒక్కో మంచంపై ముగ్గురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి
ఆం ధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. సాలూరు ప్రాంతంలో రోగుల సంఖ్య భారీగా పెరగడంతో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. ఒక్కో గ్రామం నుంచి ఐదు నుంచి పది మంది వరకు జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రికి చేరుతున్నారు. ఈ పరిస్థితి స్థానికుల్లో తీవ్ర ఆందోళనను సృష్టిస్తోంది. సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో వార్డులు అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రి సామర్థ్యం మించి రోగులు వచ్చిన కారణంగా ఒక్కో బెడ్ పై ముగ్గురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఒక్క రోజులోనే 63 మంది కొత్త రోగులు చేరగా, శనివారం మరో 31 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ జ్వరాలు ప్రభావితం చేసిన వారిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. కరడవలస గ్రామం నుంచి ఒక్కసారిగా ఎనిమిది మంది పిల్లలు ఆసుపత్రిలో చేరడం గమనార్హం. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తోంది. అలాగే జిల్లేడువలస పంచాయతీ నారింజపాడు గ్రామంలోని మరో కుటుంబంలోని ముగ్గురు పిల్లలు కూడా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రి వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పిల్లల వ...