Posts

Showing posts with the label Mandya district

యువకుడితో యువతి అదృశ్యం : సహకరించాడని రెండు కాళ్లు విరగ్గొట్టిన యువతి వర్గం

Image
క ర్నాటక కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా కె.ఆర్‌.పేట తాలూకా, బొమ్మలాపూర్‌ గ్రామానికి చెందిన నింగన్న కుమార్తె ఒక యువకుడిని ప్రేమించి అదృశ్యమైంది. అదే గ్రామానికి చెందిన ప్రకాష్‌ ఆమెకు సహాయం చేశాడని ఆరోపణలు వచ్చాయి. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కె.ఆర్‌.పేట గ్రామీణ పోలీసులు ప్రకాష్‌ పై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై అమ్మాయి సోదరుడు సంజయ్‌ అడగడంతో నవీన్‌ వర్గం సంజయ్‌పై దాడి చేసిందని చెబుతున్నారు. ఈ విషయంపై రెండు వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. గిరీష్, సంజు, మంజు, జీవన్, శశికుమార్, మదన్, ముద్దప్ప, పవన్, మాదప్ప, నింగన్న, రవి, శివన్న అనే నిందితులు మైసూరుకు చెందిన నవీన్‌ అతడి బావమరిది ప్రకాష్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రకాష్‌ రెండు కాళ్లు విరిగిపోయియి. ప్రకాష్‌ ను వెంటనే పాండవపుర ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం మైసూర్‌లోని కె.ఆర్‌.ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు నిందితుడు గిరీష్‌ ను అదుపులోకి తీసుకుని, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.