బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌కు సంబంధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు సమాచారం. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా పోలీసులు POCSO చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌ను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో భగీరథ్ తరపు న్యాయవాదులు మల్కాజ్‌గిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై శనివారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. భగీరథ్ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న గౌరవ న్యాయస్థానం.. కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ రావడంతో భగీరథ్ జైలు నుంచి విడుదల కానున్నారు.