Posts

Showing posts with the label Malayalam Actress Sajini Attacked in Hyderabad

హైదరాబాద్‌లో మలయాళ నటి సజినిపై దాడి : ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

Image
ప్ర ముఖ మలయాళ నటి సజినిపై హైదరాబాద్‌లో దాడి జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆస్తి వివాదంలో కొందరు తనపై దాడి చేశారని, ఏ క్షణమైనా తనను చంపేసే ప్రమాదం ఉందని ఆమె ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. 'నాకు తీవ్ర ప్రాణహాని ఉంది. దయచేసి నన్ను రక్షించండి' అని పోలీసులను వేడుకున్నారు. సజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సజిని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 2000వ దశకం ప్రారంభంలో ప్రముఖ నటి షకీలాతో కలిసి పలు బీ గ్రేడ్, సాఫ్ట్ కోర్ సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ఆస్తి వివాదాల కారణంగా ఒక నటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, తనకు ప్రాణహాని ఉందంటూ రక్షణ కోరడం ప్రస్తుతం సినీ వర్గాల్లో, స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.