Posts

Showing posts with the label Majid assumed his duties in 2025

ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మాజిద్‌ ఖాదేమి మృతి

Image
ఇ స్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మాజిద్‌ ఖాదేమిని అమెరికా హత్య చేసినట్లు ఇరాన్‌ మీడియా ప్రకటించింది. ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మరణించిన తర్వాత, 2025లో మాజిద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్‌ భద్రతా వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన .. దశాబ్దాల పాటు గూఢచర్య, శత్రువుల గూఢచర్యాన్ని భగ్నం చేసే బాధ్యతలు చేపట్టారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ముందు ఇంటెలిజెన్స్‌ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌ హెడ్‌గానూ ఉన్నారు. ఇరాన్‌ రక్షణ శాఖలో ఉన్నత పదవులను నిర్వహించారు. ఇరాన్‌పై మరోసారి ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. సోమవారం లోగా హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవకపోతే, ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్‌ కేంద్రాలు వంటి పౌరమౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని పేర్కొన్నారు. ఉచ్ఛరించలేని పదాలతో ఉన్న పోస్ట్‌ను ఆదివారం తన సోషల్‌మీడియా ట్రూత్‌లో తెలిపారు. ఇరాన్‌లో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని బెదిరించారు. "ఇరాన్‌లో మంగళవారం విద్యుత్‌ కేంద్రాల దినోత్సవం, వంతెలన దినోత్సవం.. అన్నీ కలిపి ఒకే రోజు జరగనున్నాయి. ఇటువంటిది మరెక్కడా ఉండదు. ఆ……..జలసంధిని తెరవండి.. రా, …. లే...