Posts

Showing posts with the label Maheshwar Building residential complex in Dahisar West

కారు బోనెట్‌లో ఏడు అడుగుల కొండచిలువ

Image
ముం బైలోని దహిసర్ వెస్ట్ ప్రాంతంలో గల మహేశ్వర్ బిల్డింగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో పార్క్ చేసి ఉన్న కారు బోనెట్‌లో దాదాపు ఏడు అడుగుల భారీ కొండచిలువ నక్కి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ సమీర్ గుప్తాకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన, కారు బోనెట్‌ను తెరిచి ఇంజిన్ భాగం మధ్యలో చిక్కుకున్న కొండచిలువను అత్యంత చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. అనంతరం, సమీపంలోని సంజయ్ గాంధీ జాతీయ పార్కు అటవీ ప్రాంతంలో దాన్ని సురక్షితంగా విడిచిపెట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.