Posts

Showing posts with the label Mahboob Alam Khan

న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసు : రూ.25 లక్షల సుపారీ ఇచ్చిన మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్‌

Image
హై దరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ  హత్యకు వ్యూహం రచించిన ప్రముఖ రాజకీయ నేతతో పాటు ఆయన కుమారుడిని, అలాగే హత్యకు సహకరించిన సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులైన ఆలంఖాన్‌లు ఈ హత్యకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించారు. రాజకీయ నేత మహబూబ్ ఆలంఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్‌లకు చెందిన కొన్ని భూములకు న్యాయవాది మొయినుద్దీన్ అడ్డుపడుతున్నాడనే కక్షను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే మొయినుద్దీన్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేసిన ఆలంఖాన్, ఆయనను హతమార్చేందుకు రూ.25 లక్షల భారీ మొత్తాన్ని సుపారీగా ఇచ్చారు. మొయినుద్దీన్‌ను అంతమొందించేందుకు నిందితులు చాలా పక్కాగా వ్యూహం రచించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు న్యాయవాది మొయినుద్దీన్‌ను కారుతో బలంగా ఢీకొట్టి, హిట్ అండ్ రన్ తరహాలో ప్రమాదంగా చిత్రీకరిస్తూ దారుణంగా హత్య చేశారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన అనంతరం నిందితుల గ్యాంగ్ పోలీసుల భయంతో ఇతర రాష్ట్రాలకు పారిపోయింది. అయినప్పటికీ రంగంలోకి ...