శ్రీలంకలో ఎంపీల పెన్షన్లు రద్దు
శ్రీ లంక ప్రభుత్వం ఎంపీలకు ఇచ్చే పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించింది. ఈ సభలో 225 మంది సభ్యులు ఉండగా, 154 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు సభ్యులు మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. మిగతా సభ్యులు ఓటు వేయలేదు. ప్రస్తుతం శ్రీలంకలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఎంపీలకు పెన్షన్ అందుతోంది. కొత్త చట్టం పార్లమెంటులో ఆమోదం పొందడంతో అందరికీ ఈ పెన్షన్లు నిలిచిపోనున్నాయి. అంతేకాదు దిసనాయకే సర్కార్ అధికారంలోకి వచ్చాక మాజీ అధ్యక్షులకు ఇచ్చే ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. శ్రీలంకకు పర్యాటక రంగంతోనే ఎక్కువగా ఆదాయం వస్తుంది. అయితే కరోనా, ఉగ్రదాడుల కారణంగా పర్యాటకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణ లోపం కూడా ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో 2022లో శ్రీలంక ప్రభుత్వం దివాళా తీసింది. ఆ దేశంలో ఆహారం, విద్యుత్, చమురు, ఔషధాలపై తీవ్రంగా సంక్షోభం నెలకొంది. ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. చివరికి అప్పటికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మార్క్సిస్టు నేత దిసనాయకే అధ్య...