Posts

Showing posts with the label MP DK Aruna

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు !

Image
మ హిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మహిళా రిజర్వేషన్లు, పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి సాయపడుతుందని, మహిళా రిజర్వేషన్ల అంశంపై రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు ఆమె సూచించారు. ఈ రిజర్వేషన్ల ద్వారా చట్టసభల్లో మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయని, దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మద్దతును అవసరమని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇలాంటి చట్టాలు మహిళలకు చాలా మేలు చేస్తాయని ఎంపీ తెలిపారు. రిజర్వేషన్లతో చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుందని డీకే అరుణ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్‌ రెడ్డికి అవగాహన లేదన్నారు. తాము కూడా దక్షిణాదిలోనే ఉన్నామని, అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్‌ జరుగుతుందని, ఈ ప్రక్రియకు రెండేళ్ల సమయం పడుతుందని అన్నారు. డీలిమిటేషన్‌, మహిళల రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్‌ను కోరుతున్నాని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రేవంత్‌కే వదిలేస్తున్నాని కిషన్‌...