Posts

Showing posts with the label Look Out Notice' had been issued against her

యూట్యూబర్‌ నందన అరెస్టు

Image
లం డన్‌ లో ఉద్యోగాలు, స్పాన్సర్‌ షిప్స్ ఇప్పిస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ప్రముఖ తెలుగు యూట్యూబర్ రమా నందనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ లో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు ఆమెను ఆంధ్రప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. లండన్‌ లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నందనపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. యూకే లో ఉద్యోగాలు, వీసాల పేరిట రూ.15 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానెల్ తో తెలుగు రాష్ట్రాల్లో ఆమె గుర్తింపు పొందారు. ఆమె తన భర్త జాగర్లమూడి మధుకర్ ఇద్దరు పిల్లలతో కలిసి లండర్ ఉంటున్నారు. అక్కడి నుంచే ఆమె యూట్యూబ్ కంటెంట్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే వీరిపై ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ లో చీటింగ్ కేసు నమోదైంది. యూకేలో నివాసం ఉంటున్న మామిళ్లపల్లి శివక్ర...