ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన మద్యం అమ్మకాలు : ప్రతి సీసాకు నెంబర్ కేటాయింపు
ఆం ధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల్లో తెచ్చిన మార్పులతో విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో నకిలీ మద్యం పూర్తిగా అరికట్టేందుకు కీలక విధానం అమల్లోకి తెస్తున్నారు. బెల్టు షాపుల పైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కాగా ఇక నుంచి మద్యం బ్రాండ్ తయారీ తేదీ, నెంబర్ తో సహా అమ్మకాల వరకు ప్రతీ సీసాకు నెంబర్ కేటాయించాలని తాజా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో నకిలీ నివారణ కోసం వినూత్న పద్దతి అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు నకిలీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకు మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ప్రతీ సీసా పైన క్యూ ఆర్ కోడ్ ద్వారా వినియోగదారుడు మద్యం క్వాలిటీ తెలుసుకునే అవకాశం ఉంది. కాగా, దేశంలోనే మొదటి సారి ప్రతీ మద్యం సీసా పైన లిక్కర్ ఐడింటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం బ్రాండ్.. తయారీ తేదీ తో పాటుగా సీసాకు నెంబర్ కేటాయిస్తూ ప్రతీ సీసా పైన ముద్రిస్తారు. ప్రతీ వినియోగదారుడు ఈ నెంబర్ ఆధారంగా మద్యం కొనుగోలు చేసే విధంగా అవగాహన పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. తాజాగా ఎక్సైజ్ శాఖ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండ...