పోలవరం, నల్లమల్లసాగర్‌పై న్యాయపోరాటానికి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పో లవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయపోరాటానికి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ కేసులో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు న్యాయ బృందాన్ని, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన ఈ అంశంపై సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, కీలకమైన సమాచారాన్ని వెంటనే న్యాయవాదుల బృందానికి అందించాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజినీర్-ఇన్-చీఫ్ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏటా గోదావరి నది నుంచి సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, అందులో నుంచి కేవలం 200 టీఎంసీల నీటిని మాత్రమే...