లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల
దే శీయ మార్కెట్లో లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఈ ఫోన్ వివరాలను లావా X పోస్ట్ లో షేర్ చేసింది. బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే డిజైన్ వెల్లడయింది. దీర్ఘచతురస్రాకార కెమెరా డిజైన్ ను కలిగి ఉంది. వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP AI కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంటుంది. 2K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. 8MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇది వెనుక వైపు కూడా చిన్న డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేతో నోటిఫికేషన్‌లు, క్యాప్చర్ సెల్ఫీ, మ్యూజిక్ కంట్రోల్ సహా అనేక యాప్స్ ను సులభంగా వినియోగించుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ అనేక వివరాలు లీక్ అయ్యాయి. దీని ఆధారంగా ఈ లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 1.6 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ చిప్ 6GB LPDDR5 ర్యామ్...