Posts

Showing posts with the label Keshkal Division Kumari and Kiskoda Area Committee.Keshkal Division Committee Secretary Mukesh

పోలీసుల ఎదుట లొంగిపోయిన 21 మంది మావోయిస్టు

Image
ఛ త్తీస్‌గఢ్‌ లో ఆదివారం మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్‌ రేంజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులు కేశ్‌కాల్‌ డివిజన్‌ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని, లొంగిపోయిన వారిలో కేశ్‌కాల్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ముకేష్‌, నలుగురు డీవీసీఎంలు (డివిజన్‌ వైస్‌ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఏఎంసీ (ఏరియా కమిటీ సభ్యులు)లతో పాటు ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. బస్తర్‌రేంజ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ సుందర్‌రాజ్‌ మాట్లాడుతూ మావోయిస్టులు తాము అనుసరిస్తున్న మార్గం వ్యర్థమని భావించి వారి జీవితాలను పునర్నిర్మించుకునేందుకు జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని ఎంచుకున్నారన్నారు. ఆయుధాలను విడిచిపెట్టిన 21 మందిలో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారన్నారు. వారంతా సాయుధ పోరాటాన్ని వీడి శాంతి, పురోగతి మార్గంలో వెళ్లాలనుకుంటున్నారని పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.