Posts

Showing posts with the label Karnataka Government Launches Search Operations

కర్ణాటకలో ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన కేరళ యువతి : గాలింపు చర్యలు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం

Image
క ర్ణాటకలో ట్రెక్కింగ్ చేస్తూ కేరళ  పర్యాటకురాలు తప్పిపోయింది. నాలుగు రోజులైనా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె కోసం కర్ణాటక ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. కేరళకు చెందిన జీఎస్ శరణ్య అనే 36 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ కర్ణాటకకు సోలో ట్రిప్ కోసం వచ్చింది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని కక్కాబే అనే గ్రామంలో ఉన్న ఒక ప్రైవేటు హోం స్టేలో ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 2న తడియాండమోల్ అనే అటవీ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసం వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ అటవీ అధికారుల వద్ద రిజిష్టర్ చేసుకుంది. ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయని, సాయంత్రంకల్లా తిరిగి రావాలని అధికారులు ఆమెకు సూచించారు. మరో 10 మంది బృందంతో కలిసి వెళ్లి తిరిగి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె పేరు, వివరాలు నమోదు చేసుకుని అనుమతించారు. సాయంత్రం ఆమె మినహా అందరూ తిరిగొచ్చారు. దీంతో శరణ్య మిస్ అయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులు, అటవీ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు, అటవీ అధికారులు, యాంటీ నక్సల్స్ ఫోర్స్ కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఆమెను వెతికేందుకు డ్రోన్లు కూడా వాడుతున్నారు. నాలుగు రోజులైనా శరణ్య ఆచూకీ దొరకలేదు...